కవి కాలాదుల పట్టిక
6 వ తరగతి |
||||||
పాఠం పేరు |
కవి |
కాలం |
జన్మ స్థలం |
బిరుదులు |
మూల గ్రంధం |
ఇతర రచనలు |
అమ్మ ఒడి |
బాడిగ వెంకట నరసింహ రావు |
15.08.1913 06.01.1994 |
కృష్ణా జిల్లా కౌతరం |
బాల బంధు |
బి.వి.నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం |
బాల రసాలు, పాలబడి పాటలు,
ఆవు - హరిశ్చంద్ర, బాలతనం,
చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి
17 పిల్లల పుస్తకాలు |
బాల సాహిత్యం ఉద్యమ స్పూర్తితో వ్యాప్తి చెయ్యడం వీరి యొక్క జీవిత ధ్యేయం వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన అనార్కలి నాటకం లో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు |
||||||
తృప్తి |
సత్యం శంకరమంచి |
03.03.1937 21.05.1987 |
గుంటూరు జిల్లా అమరావతి |
1979 లో అమరావతి కధలు రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం |
అమరావతి కధలు |
అమరావతి కధలు, కార్తీక దీపాలు, కధా సంపుటాలు, రేపటిదారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు హర హర మహాదేవ నాటకం,
దిన వార పత్రికల్లో అనేక వ్యాసాలు |
మాకొద్దీ తెల్లదొరతనం |
గరిమెళ్ళ సత్యన్నారాయణ |
14.07.1893 18.12.1952 |
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు |
|
|
స్వరాజ్య గీతములు-1921లో, హరిజనుల పాటలు-1923లో, ఖండ కావ్యాలు-1926లో దండాలు దండాలు భరతమాత,
మాకొద్దీ తెల్లదొరతనం అనే గేయాలు, భక్తి గీతాలు,
బాల గీతాలు |
దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ |
||||||
సమయస్ఫూర్తి |
కందుకూరి వీరేశలింగం |
16.04.1848 27.05.1919 |
రాజమండ్రి |
గద్య తిక్కన |
కందుకూరి గారు అనువదించిన పంచతంత్ర కధలులో విగ్రహం అనే భాగం లోది |
రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు,
హాస్య సంజీవని, సతీహిత భోదిని, ఆంధ్ర కవుల చరిత్ర |
పంచతంత్ర కధలు సంస్కృతంలో విష్ణు శర్మ అనే పండితుడు రచించాడు దీనిని నీతిచంద్రిక అనే పేరుతో తెలుగులో అనువదించినది పరావస్తు చిన్నయసూరి |
||||||
నార్ల చిరంజీవి - 20 వ శతాబ్దం - తెలుగు పూలు శతకం
పక్కి అప్పలనరసింహం - 17 వ శతాబ్దం - కుమార, కుమారీ శతకాలు వేమన
- 17 వ శతాబ్దం - వేమన శతకం
పోతులూరి వీరబ్రహ్మం - 17 వ శతాబ్దం - కాళికాంబ సప్తసతి కరుణశ్రీ - 20 వ శతాబ్దం - తెలుగు బాల శతకం
మారద వెంకయ్య - 16 వ శతాబ్దం - భాస్కర శతకం తిక్కన
- 13 వ శతాబ్దం - మహాభారతం
కంచర్ల గోపన్న - 17 వ శతాబ్దం - దాశరదీ శతకం |
||||||
మమకారం |
చిలుకూరు దేవపుత్ర |
24.04.1952 18.10.2016 |
అనంతపురం జిల్లా కాల్వ పల్లె |
|
ఆరుగ్లాసులు కదా సంపుటి |
ఏకాకి నౌక చప్పుడు,
చివరి మనుషులు, బందీ,
వంకర టింకర, ఆరు గ్లాసులు అనే కదా సంపుటాలు అద్దంలో చందమామ, పంచమం అనే నవలలు |
పంచమం అనే నవలకి వచ్చిన పురస్కారాలు - అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవల పోటీలో తృతీయ బహుమతి
(1996లో), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిది పురస్కారం (2000లో), చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం(2001),
ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం |
||||||
మేలుకొలుపు |
కుసుమ ధర్మన్న |
17.03.1900 1946 |
రాజమహేంద్రవరంలో లక్ష్మీవారపు పేట |
|
హరిజన శతకం అనుబంధం |
నిమ్నజాతి ముక్తి తరంగిణి,
నల్లదొరతనం, హరిజన శతకం,
మాకొద్దీ నల్లదొరతనం |
తల్లిదండ్రులు - కుసుమ నాగమ్మ,
వీరా స్వామి వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్ర, ఆంగ్లం, హిందీ,
ఉర్దూ లలో పాండిత్యం కలవారు కందుకూరి వీరేశలింగం గారి చేత ప్రభావితం అయ్యారు అంబేద్కర్ గారి స్పూర్తితో అంటరానితనం నిర్మూలించాలని తపించే తొలి దళిత కవి |
||||||
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో రచన -
రవీంద్రనాధ్ ఠాగూర్ (07.05.1861 -
07.08.1941)
అనువాదం - గుడిపాటి వెంకట చలం (18.05.1894 - 04.05.1979) విశ్వకవి, చిత్రకారుడు, సంగీతవేత్త, విద్యావేత్త
కవి, కధా రచయిత, నవలాకారుడు, నాటక కర్త, వ్యాసకర్త. బెంగాలీ,
ఇంగ్లీష్ లలో అన్ని సాహిత్య ప్రక్రియలతో విస్తృతంగా రచనలు చేశారు. బిడ్డల శిక్షణ అనే పుస్తకం రిచించారురచించారు ఈయన రచించిన గీతాంజలి కవితకు
1913 లో నోబెల్ బహుమతి వచ్చింది. విద్యను,
పెంపకమును మేళవించవలసిన అవసరం గుర్తించిన కవి |
||||||
ధర్మ నిర్ణయం - విశ్వనాధ సత్యన్నారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం అనేవి ఈ పాఠమునకు ఆధారం. |
||||||
త్రిజట స్వప్నం |
ఆతుకూరి మొల్ల |
16 వ శతాబ్దం |
కడప జిల్లా గోపవరం |
|
మొల్ల రామాయణం సుందర కాండ |
871 గద్య పద్యాలు గల మొల్ల రామాయణం |
డూ డూ బసవన్న |
రావూరి భరద్వాజ |
05.07.1927 18.10.2013 |
గుంటూరు జిల్లా తాడికొండ |
|
జీవన సమరం అనే వ్యధార్ధ జీవుల యదార్ధ గాథల పుస్తకం |
విమల
(తొలికధ), పాకుడురాళ్లు నవల, అపరిచితులు, కదాసాగరం వంటి 37 కదా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం,
కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు, కరిమ్రింగిన వెలగపండు, జల ప్రళయం వంటి 17 నవలలు |
రావూరి భరద్వాజ గారి పురస్కారాలు - పాకుడురాళ్లు నవలకి జ్ఞాన్ పీఠ్
, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,
రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు,
సోవియట్ భూమి నెహ్రు పురస్కారం, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న(ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు |
||||||
ఎంత మంచివారమ్మా ! |
వెన్నెలకంటి రాఘవయ్య |
04.06.1897 24.11.1981 |
|
నెల్లూరు గాంధీ |
యానాదులు అనే పుస్తకం |
యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి
22 పుస్తకాలు, తెలుగులో అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి
10 పుస్తకాలు |
సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు 1973 లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. |