Latest Educational News
పది పరీక్షల సామగ్రి
★ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను కరోనా నేపథ్యంలో అనివార్యంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
★ ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారైన జవాబు బుక్ లెట్స్, గ్రాఫ్ షీట్లు, ఇతరత్రా సామగ్రిని పటిష్ట ఏర్పాట్ల మధ్య భద్రపరచాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ సుబ్బారెడ్డి సూచించారు.
★ పరీక్షల నిమిత్తం 24 పేజీల బుక్ లెట్ గ్రాఫ్ షీట్లు, బాక్స్ ఫోల్డింగ్ కవర్లుల నంబరింగ్ మెషీన్లను జిల్లా విద్యాశాఖాధికారులకు పంపించారు.
★ పరీక్షలు రద్దు కావడంతో అవి దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
★ ఎవరైనా, ఎక్కడైనా దుర్విని యోగం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.