Ticker

6/recent/ticker-posts

5వ తరగతి తెలుగు (భాగం - 2)


9. సీతాకోకచిలుకలు
  • పచ్చని రంగు - గన్నేరులతో
  • ఎర్రని రంగులు - కరవీరంతో
  • సీతాకోకచిలుకలు ప్రధానంగా గులాబీ, ఎరుపు, పసుపు రంగులలో ఉండే పూలకు ఆకర్షితమవుతాయి.
  • ప్రపంచంలో మొత్తం "25 వేలు" రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. మన దేశంలో పదిహేనువందల రకాలు, మన రాష్ట్రంలో రెండువందల రకాలు ఉన్నాయి.
  • ఇంద్రధనస్సు - హరివిల్లు







10. నీడఖరీదు
  • పిసినారి పాపయ్య స్వభావం - పిల్లికి బిచ్చం పెట్టని, ఎవరి పొడా గిట్టని
  • పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నది - శివయ్య
  • క్రియాపదం లేకపోయినా పూర్తి అర్ధం ఇచ్చే వాక్యాలు - క్రియారహిత వాక్యాలు
  • ఉదా - సీతయ్య అమాయకుడు, మా ఊరు రామాపురం




11. ప్రయత్నిస్తే ..
  • ఈ పాఠంలో అమ్మాయి పేరు - షర్మిల
  • పాఠశాలలో నిర్వహించే ప్రదర్శన కోసం షర్మిల తయారుచేసిన బొమ్మ  - పిల్లి బొమ్మ (స్పాంజి తో)
  • పుస్తక ప్రదర్శనలకు పెట్టింది పేరు బెజవాడ(విజయవాడ). దీనిని ప్రతీ సంవత్సరం విజయవాడలో "స్వరాజ్ మైదానం" లో ఏర్పాటు చేస్తారు.







12. సంక్రాంతి
  • సంక్రాంతి - రైతన్నలకు పంటల పండగ, మగువలకు ముగ్గుల పండగ, కన్నెపిల్లలకు గొబ్బి పండగ, సర్వజనావళికి భోజనాల పండగ.
  • ఈ పండగ భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు పేర్లతో మూడు రోజులు జరిపే పండగ.
  • తిరుమణి తిరుచూర్ణం దిద్దుకుని, ఒక చేత తంబురా, మరో చేత చిడతలు పట్టుకుని శిరం మీద అక్షయపాత్ర తొనక్కుండా నిలిపి రంగభజన చేస్తూ మేలుకొలుపు పాడుతూ "హరిదాసులు" వీధివీధులు తిరుగుతారు.
  • రధం ముగ్గు సూర్యగమనానికి సంకేతం.
  • పిపీలకాలు - చీమలు
  • స్త్రీలు మట్టితో చేసిన అమ్మవారిని గౌరమ్మగా భావించి పూజిస్తారు.
  • గురుగులు - చిన్న పిడతలు
  • బాలికలు గుమ్మడిపూలతో, పసుపుకుంకుమతో గొబ్బిపూజ చేస్తారు. ముగ్గుల్లో గోమయంతో చేసిన మూడు గొబ్బిళ్ళను శ్రీకృష్ణుడు, గోమాత, గోవర్ధనగిరి అని నమ్ముతారు.
  • గొబ్బి దేవతను మహాలక్ష్మి స్వరూపంగా కూడా స్తుతిస్తారు.
  • కొలను దేవరకు గొబ్బియ్యాల్లో ------- పాట రాసింది - అన్నమాచార్యులు
  • సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించడం. దీనిని "మకర సంక్రాంతి" అంటారు.
  • సూర్య భ్రమణం ఉత్తరదిశగా మొదలు కావడంతో దీనిని "ఉత్తరాయణ పుణ్యకాలం" అని అంటారు.
  • సంక్రాంతి నాడు పొంగలి చేసే పాత్రకు "చెరకు, అల్లం" కడతారు
  • తెలంగాణ ప్రాంతంలో సకినాలు, అరిసెలు, నువ్వులతో చేసిన లడ్డూలు, బూరెలు వంటివి తయారు చేస్తారు.
  • కనుమను "పశువుల పండగ" అని అంటారు.
  • భోగినాడు పెట్టిన గౌరమ్మను కనుమనాడు సాయంకాలం మహిళలు ఊరి చివర చెరువులో జలక్రీడలు ఆడిస్తారు.
  • చక్కిలాలు (సకినాలు) - బియ్యం పిండి, నువ్వులు, వాము, ఉప్పు
  • కనుమ రోజు మహిళలు అంతా నువ్వులు, బెల్లం కలిపి పొడిగా చేసి "తీపి తిని తియ్యగా మాట్లాడు, నువ్వులు తిని నూరేళ్లు బతుకు" అని బంధుమిత్రులుకి పంచుతారు.
  • మాట్లాడడం కోసం రాసుకునే వ్యాసాన్ని "ప్రసంగవ్యాసం" అంటారు.
  • వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే అక్షరాలు, పదాలను "విభక్తులు" అని అంటారు.








క్రిస్మస్
  • ఈ పండగ క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24), క్రిస్మస్ (డిసెంబర్ 25), బాక్సింగ్ డే (డిసెంబర్ 26) అనే మూడు రోజులు జరుపుకుంటారు.
  • ఈ పండగకి ఇళ్లను, చర్చిలుని వెదురు బద్దలు రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రం తయారుచేసి అలంకరిస్తారు.
  • క్రిస్మస్ ముందు రాత్రి శాంతాక్లాస్ (ఫాదర్ క్రిస్మస్) ఆకాశం నుండి ధ్రువపు జింకలు లాగే వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు.








13. రామన్న కధ
  • రామన్న ఒక మురికివాడలో నివాసం ఉంటాడు.
  • రామన్న పాఠశాలలో ప్రదర్శించిన సినిమా - "మన పల్లెసీమలు"
  • గైహికం - ఇంటిపని
14. నేను మీ ప్రియనేస్తాన్ని
  • తాటాకుల మీద రాసిన గ్రంధాలను "తాళపత్ర గ్రంధాలు" అని అంటారు.
  • తర్వాత కాలంలో రాగిరేకుల మీద కూడా రాసేవారు.
  • 1440 లో జాన్ గుటెన్ బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్నారు.
  • ఉర్దూలో కుడి నుండి ఎడమవైపు చదువుతూ వెళ్తారు. జపాన్ చైనా దేశాల్లో పై నుండి కిందకు చదువుతారు.
  • 2010 సంవత్సరం వరకు సుమారు 13 కోట్ల సంఖ్యలో పుస్తకాలు ముద్రించారు.
  • పుస్తక గొప్పదనం గూర్చి కూతురికి లేఖ రాసినది - జవహర్ లాల్ నెహ్రు.
  • గ్రంథాలయ ఉద్యమం చేపట్టింది - గాడిచర్ల హరిసర్వోత్తమరావు.
  • కంప్యూటర్ లో ఈ - బుక్ పేరుతో పిలుస్తారు.
  • ప్రపంచ పుస్తక దినోత్సవం - ఏప్రిల్ 23
  • చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో - కందుకూరి వీరేశలింగం








15. వృధా చేయం
  • యంత్ర శక్తి విద్యుచ్ఛక్తిగా మార్చేవి - టర్బైన్లు
  • మన రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనిని 'థర్మల్ విద్యుత్" అని అంటారు.
16. శతక పద్యాలు
  • వేరు పురుగు చేరి -------------- వినుర వేమ! - కీడు చేసేవాడు గుణవంతుడుని చెడగొడతాడు.
  • ఇనుము విరిగెనేని ------------ వినుర వేమ! - మనసు విరిగితే మళ్ళీ కలపడం వీలుకాదు
  • ఏరకుమీ కసుగాయలు ------------- సుమతీ!
  •           పచ్చి కాయలు ఏరి తినకూడదు. చుట్టాలను నిందించకూడదు. యుద్ధం నుండి పారిపోకూడదు. పెద్దల ఆజ్ఞలను జవదాటకూడదు.  
  • అకొన్న కూడే --------------- సుమతీ! 
  •           ఆకలితో ఉనప్పుడు తినిన అన్నం అమృతం. దేనికి వెనకడుగు వేయక దానం చేయువాడు దాత. కష్టానికి ఓర్చుకునేవాడు మానవుడు. ధైర్యం గల వాడే వంశంలో గొప్పవాడు
  • సద్గోష్టియే సిరి యొసగును -------------- కుమారా! - మంచివారితో స్నేహం చెయ్యాలి 
  • సాధు సంగమమున ------------- తెలుగు బాల! - మంచివాడితో ఉంటే సామాన్యుడు కూడా మంచి గుణాలు                                                                    అలవర్చుకుంటాడు.
  • ఇనుడు వెలుగునిచ్చు --------------- తెలుగు బాల! - గొప్పవారికి మంచి లక్షణాలు సహజంగా ఉంటాయి
  • ధర్మ గుణము మించు ------------------- తెలుగు బిడ్డ! - నిజము పలుకుట మాత్రమే నీతి అని చెపుతుంది
  • ఎరుక గల వారి చరితలు ---------------------- (మహాభారతం)
  •      జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి. మంచివారు సంగత్యంలో ధర్మం గ్రహించాలి. తెలుకున్న ధర్మం మరువకుండా ఆచరించాలి
  • శ్రద్ధ లేని యెడల ----------------------- తెలుగు బిడ్డ! - శ్రద్ధ ఉంటే దేనినైనా సాధించవచ్చు.
  • సుమతీ శతకం -  బద్దెన
  • వేమన శతకం - వేమన
  • కుమార శతకం - పక్కి అప్పలనరసయ్య
  • మహాభారతం - నన్నయ్య
  • తెలుగు బాల - కరుణశ్రీ
  • తెలుగు బిడ్డ - నార్ల చిరంజీవి
  • దరిత్రి - భూమి, వాయువు - గాలి, మర్యాద - గౌరవం

Prepared By:  A.B.Rao