Ticker

6/recent/ticker-posts

5వ

  • 5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 1)
  • 1. జంతువులు - మన జీవనాధారం
  • మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం.
  • వారి ఆహారం, రక్షణ, రవాణా కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు.
  • జంతువులు - అవసరాలు
  • రవాణా కోసం - గుర్రం, ఒంటె, గాడిద
  • జీవనోపాధి కోసం - రామచిలుక, కోతి
  • వ్యవసాయం కోసం - ఎద్దు
  • పెళ్లిళ్ల కోసం - గుర్రం, ఏనుగు
  • వినియోగ వస్తువుల కోసం - పాము, జింక, పులి, తాబేలు, గొర్రె
  • వినోదం కోసం - కోతి
  • రక్షణ కోసం - కుక్క
  • ఆహారం కోసం - కోడి, మేక

  • లింగయ్య గొర్రెలు మేపుతూ రోజుకి 30 కి.మీ. నడుస్తాడు.
  • గొర్రెల కాపరులు పదిమంది వరకు గుంపుగా వెళతారు. బరువులు మోయడానికి గాడిదను తీసుకువెళతారు.
  • గొర్రెల పై చిరుతపులులు, తోడేళ్ళు వంటివి దాడి చేస్తాయి. కుక్కలు కొంతవరకు వీటిని కాపాడతాయి. రాత్రి వేళ పాము భయం ఉంటుంది.
  • గొర్రెల కాపరులు వద్ద ఉండే సామాగ్రి - తోలు చెప్పులు, ఊలు గొంగళి, కర్ర, మంచినీటి బుర్ర
  • రైతు మిత్రులు :
  • వానపాము - భూమిలో వ్యర్ధపదార్ధాలు తింటుంది. నేల గుల్లబారేలా చేస్తుంది.
  • సాలెపురుగు - పంట నాశనం చేసే పురుగులు, దోమలు దీని గూటిలో చిక్కుకుంటాయి.
  • చీమ - మొక్కలపై ఉన్న చిన్న పురుగుల గుడ్లు తిని పంట కాపాడును.
  • పాము - పంటపొలాల్ని, ధాన్యపు కంకులని తిని నాశనం చేసే ఎలుకలని తింటుంది
  • టైకోగ్రామ - దీనిని "జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ. సి.ఎ. ఆర్)" శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. జీవితకాలం ఏడు రోజులు. శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది
  • విసనకర్ర - గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో వీటిని తయారుచేస్తారు
  • కాకినాడలో ఎద్దుకొమ్ములతో గుండీలు తయారుచేసే పరిశ్రమలు 39 దాకా ఉన్నాయి.
  • దంతాల కోసం ఏనుగులు, చర్మం కోసం పులి, జింకలు చంపుతున్నారు.
  • వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 - షెడ్యూల్ (1) ప్రకారం పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులుని వేటాడడం, విక్రయించడం నేరం.
  • ఈ నేరానికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు వరకు జరిమానా.
  • మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందాయి. పొట్టికొమ్ములు, అందమైన మూపురం, గంగడోలు కలిగి రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి.
  • ఒంగోలు జాతి గిత్తలు మన వ్యవసాయానికి వెన్నెముక వంటివి.
  • బ్రెజిల్ దేశం వాళ్ళు వీటిని అభివృద్ధి పరచి ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్ లో ఒంగోలు ఆవులు 40 లీ వరకు పాలు ఇస్తున్నాయి. బ్రెజిల్ నుండి వీటిని తేవాలంటే 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
  • భూమిపై అసలు మనిషంటూ లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవ జాతి నశిస్తుండేది.
  • నేడు ప్రతీ 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది.
  • భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో కనిపించే పులి "రాయల్ బెంగాల్ టైగర్"
  • బట్టమేక పక్షులు, కలివికోడి, ఉంగనూరు ఆవులు సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉంది
  • రాబందు - గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి కనిపించడం లేదు. వీటి ఆచూకీ తెలిపినవారికి రెండు లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించారు.
  • కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి - గౌతమ బుద్ధుడు
  • 2. వ్యవసాయం - పంటలు
  • వ్యవసాయం అంటే పంటలు పండించడం. 
  • గతంలో రైతులు తాము వేసిన పంట నుండి మేలు రకం గింజలు విత్తనాల కొరకు భద్రపరిచేవారు. ఇప్పుడు అంతా మార్కెట్ పై ఆధారపడుతున్నారు.
  • గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు పేరిట విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చాక తిరిగి ఇచ్చేవారు. ఈ పద్దతిని "నాగులు" అన్నారు.
  • మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ వంగడాలు ఉండేవి
  • మొక్కల జన్యువులు భద్రపరిచే సంస్థ - నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్
  • ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం - అంతర పంటలు
  • వానపాముల సాయంతో వర్మికంపోస్టు తయారుచేస్తారు.
  • పంచగవ్య - ద్రవరూప ఎరువు - ఆవుమూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరినీళ్లు, బెల్లం, నీరు కలిపి తయారుచేస్తారు. ఇది "సూక్ష్మజీవనాశిని"
  • జీవామృతం - ఆవుమూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాలు పొడి, నీరు కలిపి చేస్తారు. ఇది "సూక్ష్మజీవులు వృద్ధి" చేసేది.
  • గుడ్ల కోసం పెంచే కోళ్లు - లేయర్లు, మాంసం కోసం బ్రాయిలర్
  • తోగాళ్ళు - కంది, తయిదలు - రాగులు, బొబ్బర్లు - అలసందలు
  • దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
  • పండ్లు, కూరగాయలు పై గల పురుగుల మందులు పోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  • సాంప్రదాయ, సేంద్రియ పురుగుల మందులు అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కాషాయం, వావిలాకు కాషాయం, పంచగవ్య మొదలైనవి పంటల పై అవసరం మేర చల్లాలి.
  • రసాయన ఎరువులు, పురుగుల మందులు వల్ల భూసారం తగ్గుతుంది.
  • వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెధాన్యాలు, కూరగాయలు, పళ్ళు మొదలైనవి - ఆహార పంటలు
  • పత్తి, జనుము, మిర్చి వంటివి - వాణిజ్య పంటలు
  • జొన్న - పచ్చ జొన్న, తెల్ల జొన్న
  • వరి - IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారుతీగ, సాంబ
  • కంది - ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి
  • వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. కంది పంటకు 6 నెలలు పడుతుంది.
  • వరికి ఎక్కువ నీరు అవసరం, జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరం.
  • జొన్న, శనగ వంటి పంటలను "ఆరుతడి పంటలు / వర్షాధార పంటలు" అంటారు.
  • రాష్ట్రంలో పంటలు పండే ప్రాంతాలు
  • వరి - all Andhra Pradesh
  • జొన్న - తూ.గో
  • పత్తి - గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం, 
  • మిరప - గుంటూరు, నెల్లూరు
  • మామిడి - తూ.గో, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూర్
  • కొబ్బరి - తూ.గో, ప.గో
  • గోధుమ - తూ.గో
  • మొక్కజొన్న - తూ.గో, గుంటూరు
  • 3. మనం చెట్లను పెంచుదాం!
  • అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 33% ఉండాలి. మన దేశంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి.
  • మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరం
  • మొక్కలు - ఉత్పత్తిదారులు
  • మేడలపై పచ్చదనంతో నగర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంటి పైకప్పు చల్లగా ఉంటుంది.
  • పెద్దవిగా పెరిగే చెట్లు చిన్న కుండీలలో పెంచడాన్ని "బోన్సాయ్(వామన వృక్షాలు)" అని అంటారు. ఇది జపాన్ దేశ సాంప్రదాయ కళ.
  • వేరొక చెట్టు నీడలో నాటితే మొక్క పెరగదు.
  • డాంబరు పూసిన కర్రకి చెదలు పట్టవు.
  • చెట్టుకి చీడ పట్టినపుడు వేప పిండిని నీటిలో అయిదు రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకి చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది
  • మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతి పిల్లలకి అందించడం వంటి అంశాలు పిల్ల, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ - కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్
  • ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా చేపట్టిన ఉద్యమం "వన ప్రేరణ ఉద్యమం". దీనిలో భాగంగా 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు.
  • ఇటీవల హరిత పాఠశాల అవార్డ్ పొందిన పాఠశాల - గడ్డంపల్లి (మహబూబ్ నగర్ జిల్లా, తెలకపల్లి మండలం)
  • పర్యావరణం పచ్చదనంతో నింపడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తో పాటు వందేమాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలైన సంస్థలు కృషి చేస్తున్నాయి.
  • నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు - పాఠశాల పచ్చదనంతో నింపడం, పర్యావరణ పరిరక్షణ, పని అనుభవం ద్వారా పచ్చదనం ఆస్వాదించడం, శ్రమ విలువ గుర్తించడం, వాతావరణ కాలుష్యం గుర్తించడం, గ్రామస్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం.
  • నగరాల్లో 67% జనాభా నివసిస్తున్నారు.
  • కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
  • ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది - వేప చెట్టు
  • 4. పౌష్టికాహారం
  • వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, తాయిదలు(రాగులు), సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు.
  • చిరుధాన్యాలలో పిండిపదార్ధాలు అధికంగా ఉంటాయి. శక్తినిచ్చే ఆహారపదార్ధాలు - పిండిపదార్ధాలు
  • అలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప వంటి పండ్లలో శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె వంటి వాటిలో ఎక్కువ కొవ్వు పదార్ధాలు ఉంటాయి.
  • కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరం అయినప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది.
  • శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠాణీలు, చిక్కుడు గింజలు మొదలైనవి పప్పు ధాన్యాలు. పప్పుధాన్యాలలో ప్రోటీన్లు ఉంటాయి.
  • కొత్త కణాలు పుట్టడంలో గాయాలు మాన్పడంలో ప్రోటీన్లు(మాంసకృతులు) ఉపయోగపడతాయి.
  • అయోడీన్, పాస్ఫరస్, కాల్షియమ్, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి.
  • రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియమ్, పాస్ఫరస్ ఉంటాయి.
  • విటమిన్లు, ఖనిజలవణాలు తక్కువ పరిమాణంలో అవసరం
  • టొమాటో :
  • 1.08 గ్రా. ప్రోటీన్, 1.5 గ్రా. ఫైబర్ ఉంటాయి. పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీసియం, సోడియం వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ A, B2, B6, E, K లు ఉంటాయి.
  • ఒక టమాటో నుండి "22 కేలరీలు" శక్తి లభిస్తుంది

  • శక్తినిచ్చేవి, పెరుగుదలకు తోడ్పడేవి పదార్ధాలు రెండింటిని తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి. పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది. - (క్వషియార్కర్)
  • మనం తినే ఆహారంలో శక్తినిచ్చేవి (పిండిపదార్ధాలు, కొవ్వులు, నూనెలు), పెరుగుదలకు (ప్రోటీన్లు), ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధకత (విటమిన్లు, ఖనిజలవణాలు) పదార్ధాలు తప్పనిసరిగా ఉండాలి.
  • జంక్ ఫుడ్ లో సాధారణంగా కేలరీలు మాత్రమే ఉంటాయి
  • .



  • మన శరీర భాగాలు - జ్ఞానేంద్రియాలు
  • పనులు చేయడానికి మనం ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఉపయోగిస్తాం. అప్పుడు అవయవాల మధ్య సమన్వయం అవసరం అవుతుంది.
  • జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం - వీటి ద్వారా వివిధ విషయాలకు చెందిన జ్ఞానం తెలుస్తుంది.
  • చదివినప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన దూరం - 30 సెం. మీ. టి.వి చూసినపుడు రెండున్నర మీటర్ల దూరం నుండి చూడాలి.
  • కంటి వైద్యం చేసే డాక్టర్ - ఆప్తమాలజిస్ట్ 
  • ఒక వ్యక్తికి పుట్టుక నుండి చెవులు వినపడకపోతే అతనికి మాట్లాడడం రాదు.
  • మాటలు రానివారికి గుర్తులు, సైగలతో విషయాలు తెలియజేస్తారు. దీనిని "షైన్ లాంగ్వేజ్" అంటారు.
  • వినలేని స్థాయిలో పెద్ద శబ్దాలు చేసినప్పుడు ధ్వని కాలుష్యం అవుతుంది.
  • చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు వైద్యం చేసే డాక్టర్ - ENT నిపుణులు
  • గబ్బిలం రాత్రి పూట సంచరిస్తుంది. అది తన దారిలో అడ్డంకులను శబ్దాలు ద్వారా గ్రహిస్తుంది.
  • ముక్కు ద్వారా గాలి పీల్చడం, వదలడం - శ్వాసించడం
  • లోపలికి పీల్చుకోవడం - ఉచ్వ్వాసం, బయటకు వదలడం - నిశ్వాసం
  • నాలుక మాట్లాడడానికి, ఆహారం మింగడానికి రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడును.
  • నాలుకపై రుచిమొగ్గలు రుచి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
  • ఆహారపదార్ధాలు నమిలినపుడు లాలాజలంతో కలసి రుచి ఏర్పడుతుంది.
  • దంతాలు : కొరకు దంతం, కోర దంతం, నములు దంతం, విసురు దంతం - దంతసూత్రం - 2123/2123
  • దంతాలు ఆహారం నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగపడును. చిన్న పిల్లలకు మొదటగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు.
  • దంతాలు శుభ్రం చేసుకోకపోతే సూక్ష్మజీవులు చేరి  హాని చేసే ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల దంతాలు పసుపు, నలుపు రంగులలో మారతాయి.
  • ఇటుకపొడి, బొగ్గు వంటి గరుకు పదార్ధాలు దంతాలు శుభ్రం చేయడానికి వాడరాదు. దీని వల్ల దంతాల పై ఏనామిల్ పొర దెబ్బ తింటుంది.
  • చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది.
  • చర్మ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - డెర్మటాలజిస్ట్
  • శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. మానవ చర్మం బరువు దాదాపు 4 కిలోలు ఉంటుంది. 1 1/2 చ.మీ. వైశాల్యం ఉంటుంది.
  • పరిసరాలలో మార్పులకు మొదటగా ప్రభావితం అయ్యేది చర్మం
  • అరచేతి వేళ్ళ చర్మం పై ఉండే ఎత్తు పల్లల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి.
  • 6. మన శరీరంలోని వ్యవస్థలు
  • శ్వాసవ్యవస్థ :
  • శ్వాస అవయవాల ద్వారా మన శరీరం గాలిలో ఆక్సిజన్ గ్రహిస్తుంది. 
  • శ్వాస వ్యవస్థలో ముక్కు, శ్వాస నాళం, ఊపిరితిత్తులు ఉంటాయి.
  • ముక్కు - శ్వాసనాళం - ఊపిరితిత్తులు
  • ముక్కు రంద్రంలో తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి.
  • ఊపిరితిత్తులలో గాలిగాదులు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి.
  • గాలిగాదులు కుడ్యం పై సూక్ష్మ రక్త నాలికలు ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ గ్రహించి రక్తం ద్వారా శరీరభాగలకు పంపుతాయి. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరిని బయటకు పంపుతాయి.
  • ఊపిరితిత్తుల వ్యాధికి వైద్యం చేసే డాక్టర్ - పల్మానాలజిస్ట్ 
  • రక్త ప్రసరణ వ్యవస్థ :
  • శరీర ఉష్ణోగ్రత క్రమబద్దీకరించడానికి రోగకారకాలపై పోరాటం చేయడానికి రక్తం ఉపయోగపడుతుంది.
  • రక్తంలో ఎక్కువ ద్రవరూప "ప్లాస్మా" ఉంటుంది. మూడు రకాల రక్త కణాలుంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు
  • ఎర్ర రక్త కణాలు - శరీర కణాలను ఆక్సిజన్ అందిస్తాయి.
  • తెల్ల రక్త కణాలు - రోగ కారక క్రిములతో పోరాడతాయి.
  • రక్త ఫలకికలు - రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి.
  • గుండె వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - కార్డియాలజిస్ట్ (హృద్రోగ నిపుణులు)
  • మన గుండె మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమవైపు , 1/3 వంతు కుడివైపు ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది.
  • పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
  • ఆస్థిపంజర వ్యవస్థ :
  • మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి.
  • అస్థిపంజరం శరీరానికి ఆకారం, ఆధారం ఇస్తుంది. తలలో ఎముకల చట్రం - పుర్రె
  • మెడ నుండి నడుము వరకు చిన్న ఎముకలుతో వెన్నెముక ఉంటుంది.
  • కాల్షియమ్ ఎముకలను దృడంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలలో కాల్షియమ్ ఎక్కువ ఉంటుంది.
  • శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది.
  • ఎముకల సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - అర్ధోపెడిషియన్
  • జీర్ణ వ్యవస్థ :
  • ఘన, ద్రవ రూపాల్లో ఉండే పదార్ధాలు చివరకు రక్తంలో కలిసేలా చాలా సరళ ద్రవాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ నోటితో మొదలవుతుంది
  • కడుపు కిటికీ (డాక్టర్ బీమాంట్ ప్రయోగం) :
  • 1822 లో మార్టిన్ అనే సైనికుడికి బీమాంట్ వైద్యం చేయవలసి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సం.
  • మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు.
  • ఆహార పదార్థాలు
    జీర్ణం కావడానికి పట్టే సమయం 

    కడుపులో 
    జీర్ణ రసాలున్న గ్లాసులో 
    మరిగించని పాలు 
    2 గం. 15 ని. 
    4 గం. 45 ని. 
    మరిగించిన పాలు 
    2 గం. 
    4 గం. 15 ని. 
    పూర్తిగా ఉడికిన గుడ్డు 
    3 గం. 30 ని. 
    8 గం. 
    సగం ఉడికిన గుడ్డు 
    3 గం. 
    6 గం. 30 ని. 
    చిలకబడ్డ పచ్చి గుడ్డు 
    2 గం. 
    4 గం. 15 ని.
  •   పచ్చి గుడ్డు                                        1 గం. 30 ని. 4 గం.

  • ఈ గ్లాస్ ని సుమారు 300  వద్ద ఉంచారు.
  • టమాటా :
  • నోటిలో ముక్కలవుతుంది. లాలాజలంతో కలుస్తుంది. 5 - 30 సెకన్ల సమయం
  • ఆహార నాళం నుండి కడుపులోకి - 10 - 15 సెకన్లు
  • కడుపులో జీర్ణరసాలతో కలుస్తుంది - 3 - 5 గంటలు
  • చిన్న ప్రేగు - 3 - 4 గంటలు
  • జీర్ణం కాని ఆహారం పెద్దప్రేగులోకి వెళ్తుంది. పెద్దప్రేగులో - 8 గంటల నుండి 3 రోజులు

  • పొట్ట 25% మేర ఖాళీ ఉండాలి.
  • విసర్జక వ్యవస్థ :
  • వెన్నెమూకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేస్తాయి.
  • చర్మం ఒక విసర్జక అవయవం. చెమట రూపంలో మలినాలను బయటకు పంపుతుంది.
  • మూత్రపిండ వ్యవస్థకు చికిత్స చేసే డాక్టర్ - యూరాలజిస్ట్
  • నాడీ వ్యవస్థ :
  • నాడులు జ్ఞానేంద్రియాలు ద్వారా పొందిన సమాచారం మెదడుకి పంపుతాయి. మెదడు విశ్లేషించి అవసరం అయిన సూచనలు నాడులు ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది.
  • నాడులు సంబంధ చికిత్స చేసే డాక్టర్ - న్యూరాలజిస్ట్
  • 7. అడవులు - గిరిజనులు
  • అరకు ప్రాంత గిరిజనుల ప్రత్యేక నృత్యం - థింసా
  • గోండు జాతి గిరిజనులు ఆదిలాబాద్ లో ఉంటారు. 
  • వీరి గుడిసెలు సాధారణంగా రాళ్లతో కట్టిన గోడలకు మందంగా నునుపుగా మట్టి పూసి ఉంటారు.
  • మహిళలు నేల మీద గోడల మీద ప్రత్యేక పద్దతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు.
  • గోండుల గ్రామదేవత "అకిపెన్"
  • గోండుల ముఖ్యమైన జాతర "నాగోబా జాతర". నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉంది.
  • నాగోబా జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.
  • గోండుల సాంప్రదాయ నృత్యం - గుస్సాడీ
  • మన రాష్ట్రంలో "చెంచులు" నల్లమల అడవులలో నివసిస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్, గుంటూరు, ప్రకాశం, తెలంగాణలో మహబూబ్ నగర్ లో ఎక్కువ ఉంటారు.
  • వీరు మాట్లాడే భాష చెంచు భాష
  • తేనె సేకరించడం చెంచులకి తెలిసినట్లు వేరేవారికి తెలీదు.
  • చెంచులు డబ్బు, ఆడంబర వస్తువులపై ఆసక్తి చూపరు.
  • చెంచు గుడిసెలు "పెంటలు" అంటారు. కొన్ని పెంటలు కలిపి గ్రామం.
  • గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. అతనిని "పెద్ద మనిషి" అంటారు.
  • వీరు పూజలో "లింగయ్య స్వామి, చెంచులక్ష్మి" పూజ ముఖ్యమైనది. ఈ పూజలు మాఘమాసంలో నిర్వహిస్తారు.
  • బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బు అంటే ఏమిటో తెలీకుండా జీవించే గిరిజనులు - బోండా జాతి
  • బోండా గిరిజనులు విశాఖలో అరకు, ఒడిశాలో మల్కాజ్ గిరి జిల్లాలో ఉంటారు. వీరిని బోండా, పోరోజు అని అంటారు.
  • వీళ్ళు మాట్లాడే భాష - రెమో
  • మన దేశంలో బోండా తెగ జనాభా 12,000 మాత్రమే.
  • వారం వారం జరిగే వీరి సంతలను "హతా" అంటారు.
  • వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తారు.
  • వీళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి బదులుగా వారికి అవసరం అయిన వస్తువులు తీసుకుంటారు. దీనిని "బినిమయ్ ప్రోదా" అంటారు.
  • వీరు జనపనార బట్టలు వేసుకుంటారు
  • జనపనార 2-3 రోజులు నానబెట్టి వాటి నుండి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు.
  • జనపనార సేకరణ - నీటిలో నానబెట్టడం - దారాలు తీయడం - మగ్గాలలో నేయడం - రంగులు రుద్దడం - ఎండలో ఆరబెట్టడం - అద్దాలు కుట్టడం
  • వెదురు, యూకలిప్తస్, సుబాబుల్ చెట్ల నుండి కాగితం తయారవుతుంది.
  • మన రాష్ట్రంలో తూ.గో., ప.గో., విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో అడవులు ఉన్నాయి.
  • ఆదిలాబాద్ జిల్లాలో గోండు, కోలామి, ప్రధాన్, తోటి తెగ గిరిజనులు ఉన్నారు.
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అడవులలో సవర, ఆదివాసీ, ఒరియా, కువి, గదబ తెగల వాళ్ళున్నారు.
  • తూ.గో., ప.గో. జిల్లాల అడవులలో కోయ తెగ గిరిజనులు ఉన్నారు.
  • మన దేశ అడవులు - 6,92,027 చ.కి.మీ.(21%). మధ్య ప్రదేశ్ 77,000 చ.కి.మీ లతో మొదటి స్థానం.
  • మన రాష్ట్ర మొత్తం భూభాగంలో అడవులు 46,389 చ.కి.మీ.(16.89%).
  • అటవీ విస్తీర్ణంలో మొదట స్థానం ఖమ్మం (43.23%)
  • కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అయితే భూమి వేడెక్కును. దీనిని భూగోళం వేడెక్కడం అంటారు. దీని వల్ల వర్షాలు తగ్గుతాయి.
  • 8. నది - జీవన విధానం
  • గోదావరి నది జన్మ స్థలం - నాశిక్ జిల్లా త్రయంబకం (పచ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండలు)
  • ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రవేశించింది. సుమారు 1465 కి.మీ. ప్రవహిస్తుంది.
  • తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఆంధ్ర ప్రదేశ్ లో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తుంది.
  • తూ.గో లోని అంతర్వేది యానాం వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
  • పులస చేప - ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించే అరుదైన చేప
  • పులస శాస్ట్రియనామం - హిల్సా హిలీసా.
  • ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో 1200 కి.మీ ప్రయాణించి గోదావరి జలాల్లో గుడ్లు పెట్టడానికి వస్తాయి.
  • పులస చేపలో "ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు" సమృద్ధిగా ఉంటాయి.
  • పాపికొండలు రాజమండ్రి భద్రాచలం మధ్య ఉన్నాయి.
  • గోదావరి నదిపై మొదటి డ్యామ్ - గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబకం పట్టణాలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్యాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి.
  • వరంగల్ జిల్లా ఎత్తిపోతల పధకం ద్వారా వరంగల్, కరీంనగర్, నల్గొండ పట్టణాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
  • గోదావరి నీటితో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లో చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప, పండ్ల తోటలు పండుతున్నాయి.
  • గోదావరి డెల్టా భూములలో వరి, కొబ్బరి పంటలు బాగా పండుతాయి.
  • గోదావరి డెల్టాలో "కోనసీమ" ప్రకృతి అందాలకు నిలయం.
  • గోదావరి పరివాహక ప్రాంతం - 3,12,812 చ.కి.మీ. ఇది భారత భూభాగంలో పదో వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం కన్నా ఎక్కువ.
  • నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
  • నాందేడ్ లో ప్రఖ్యాత సబ్ ఖండ్ గురుద్వారా ఉంది.
  • బాసర(ఆదిలాబాద్)లో ప్రముఖ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది
  • ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచల రామాలయం, మంతనిలో గౌతమీశ్వర ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిలుతున్నాయి.
  • గోదావరీ తీరంలో నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.
  • రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2,600 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.
  • భద్రాచలం పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజ్జేశ్వరం సహజవాయు విద్యుత్ కేంద్రం ఉన్నాయి.
  • గోదావరీ తీరంలో నాందేడ్, ఔరంగాబాద్, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి.
  •  

  •  





  •