Ticker

6/recent/ticker-posts

IX NS కణం - జీవుల మౌలిక ప్రమాణం

కణం - జీవుల మౌలిక ప్రమాణం
  • సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారిలో ప్రముఖులు అథినాసియస్ కిర్చర్ (1601-1680), జాన్ స్వామ్మర్ డాం(1637-1680), ల్యువెన్ హుక్(1632-1723), రాబర్ట్ హుక్(1635-1702)
  • ల్యువెన్ హుక్ మొదటిసారిగా 1674 లో బాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజావా, ఎర్ర రక్తకణాలు వంటి సజీవ కణాలను, నీటి బిందువులలో చలించే సూక్ష్మ ప్రాణులను సైతం చూసాడు. తన సుదీర్ఘ జీవితంలో అనేక రకాల భూతద్దాలు తయారుచేశారు. ఈ కటకాలతో మైక్రోస్కోప్ రూపొందించి ఎన్నో సజీవ, నిర్జీవ అంశాలు అధ్యాయనం చేసాడు.








కణం ఆవిష్కరణ
  • రాబర్ట్ హుక్ (బ్రిటన్) 1665 లో ఓక్ చెట్టు మెత్తని కాండం నుంచి పలుచని పొర తీసుకుని పరిశీలించారు.
  • కణాల చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి నిర్మాణాన్ని బ్రౌన్ గుర్తించాడు.
  • కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకం కనుక్కోవడానికి (1831) దాదాపు 180 సంవత్సరాలు పట్టింది.
  • రాబర్ట్ బ్రౌన్ మొదటిసారి కేంద్రకాన్ని ఆర్కిడ్ పత్రాలలో పరిశీలించాడు.
  • కణానికి ఆకారాన్ని ఇచ్చేది "కణత్వచం". కనత్వచం గుండా కేవలం కొన్ని పదార్ధాలు మాత్రమే లోపలికి బయటికి ప్రవహిస్తాయి.
  • కణానికి కావాల్సిన పటుత్వాన్ని ఇచ్చేది "కణకవచం"
  • కణత్వచానికి కేంద్రకాన్ని మధ్య ఉన్న జిగురులాంటి పదార్ధాన్ని "కణద్రవ్యం" అంటారు. ఇది ఒక విజాతీయ పదార్ధం.
  • కనద్రవ్యంలో కణత్వచం తో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. వీటిని "కణాంగాలు" అంటారు. దీనిలో వివిధ రసాయనాలు కూడా ఉంటాయి.









కణాలలో వైవిధ్యం :
  • ఒకే కణంతో నిర్మితం అయిన జీవులను "ఏక కణజీవులు" అంటారు.
  • ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను "బహు కణజీవులు" అంటారు.
ఆకులో కణాలు :-
  • గ్రూప్ ఎ కణాలు - కాండం బయటిపొర ఏర్పరుస్తాయి. ఇవి కాండానికి ఆకారం రక్షణ ఇస్తాయి.
  • గ్రూప్ బి కణాలు - కాండంలో ఎక్కువ ఈ భాగంలో ఉంటాయి. ఈ భాగంలో ఉండే నిర్మాణాలు కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తాయి.
  • గ్రూప్ సి కణాలు - ఇందులో కణాలన్ని కలసి పొడవైన నిర్మాణాలు ఏర్పడి నీరు, ఆహారం సరఫరా చేస్తాయి.
  • గ్రూప్ డి కణాలు - లేత కాండం మధ్యలో ఉన్నాయి. ముదురు కాండంలో ఈ గ్రూప్ కణాల స్థానంలో ఖాళీలు ఏర్పడతాయి.









కణం - ఆకారం
  • ఎర్ర రక్త కణం - 
  • నునుపు కండర కణం - 
  • నాడీ కణం - 
  • ఎముక కణం - 
  • తెల్ల రక్త కణం - 
  • రేఖిత కండర కణం - 

  • అమీబా తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారం మార్చుకుంటుంది. వీటిని "మిద్యాపాదాలు(Pseudopodia)" అంటారు.
  • ఈ మిధ్యా పాదాలు అమీబా చలనంలో, ఆహార సేకరణలో ఉపయోగపడతాయి.
  • సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి ఒక మైక్రోన్(మీటర్లో మిలియన్ వంతు) నుండి కొన్ని సెంటిమీటర్ వరకు ఉండవచ్చు.
  • అతిచిన్న బాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రోన్లు ఉంటుంది. మానవ కాలేయ కణాలు, మూత్రపిండాలు 20 నుండి 30 మైక్రోన్లు వరకు ఉంటాయి.
  • నాడీ కణం పొడవు 90 నుండి 100 సెంటీమీటర్లు. ఉష్ణపక్షి అండం అన్నింటికంటే పెద్ద కణం. దీని పరిమాణం 17CM * 18CM ఉంటుంది.
  • కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది.
  • జీవి యొక్క పరిమాణం ఆ జీవిలో కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు.









అనుబంధం :-
  • ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని "సాధారణ సూక్ష్మదర్శిని"
  • ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటే "సంయుక్త సూక్ష్మ దర్శిని".
  • మొదటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారుచేసింది "జాకారస్ జాన్సన్" (1595)
  • మైక్రోస్కోప్ లో సాధారణంగా 4 కటకాలు ఉంటాయి. అవి 4x, 10x, 40x, 100x సామర్ధ్యం కలిగి ఉంటాయి.
  • స్లైడ్ పై గల వస్తువు స్పష్టంగా కనిపించేంత వరకు అక్షీ కటకాన్ని పైకి కిందికి జరపాలి. దీనిని "కేంద్రీకృతం చేయడం" అంటారు.









స్లైడ్ తయారీ :
  • స్లైడ్ తయారీకి 2mm మందం, 3cm*8cm ఉన్న దీర్ఘ చతురస్ర పారదర్శక గాజు పలక కావాలి.
రంజనం చేయు విధానం :
  • "కణంలో వివిధ భాగాలు వేరు వేరు రంగులను పీల్చుకుంటాయి" అనే విధానంపై రంజనం చేసే పద్దతి ఆధారపడి ఉంటుంది. రంగును కలుగజేసి కారకాలు "రంజనాలు" అని విధానాన్ని "రంజనం చేయడం" అని అంటారు.
  • సాఫ్రనిన్, మిథిలీన్ బ్లూ, అయోడీన్ మరియు ఎర్ర సిరాను రంజనాలుగా ఉపయోగిస్తాం.
  • సాఫ్రనిన్ తయారీ కొరకు 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ ను 100ml నీటిలో కలపాలి.

Prepared By :- A. B .Rao