10th Class Physical Science ఆమ్లాలు-క్షారాలు-లవణాలు
Ø
→ ఆమ్లలు అనే పేరు “ఎసిడస్” అనే
లాటిన్ పేరు నుండి వచ్చింది. ఎసిడస్ అనగా పుల్లని రుచి అని అర్థం.
Ø
→ క్షారాలు అనగా రుచికి చేదుగా
ఉంటాయి. జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.
Ø
→ నీలి లిట్మస్, ఎర్ర లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్లు
సూచికలకు ఉదాహరణలు.
Ø
→ నీలి లిట్మస్ ను ఆమ్లాలు
ఎరుపురంగులోనికి మార్చుతాయి.
Ø
→ ఎర్ర లిట్మసు క్షారాలు
నీలిరంగులోనికి మార్చుతాయి.
Ø
→ మిథైల్ ఆరెంజ్ ఆమ్ల మాధ్యమంలో
ఎరుపురంగులోకి మారును.
Ø
→ మిథైల్ ఆరెంజ్ క్షార మాధ్యమంలో
పసుపురంగులోకి మారును.
Ø
→ ఫినాఫ్తలీన్‌కు ఆమ్ల మాధ్యమంలో
రంగు లేదు.
Ø
→ ఫినాఫ్తలీన్ క్షార మాధ్యమంలో
పింక్ రంగులోకి మారును.
Ø
→ లిట్మస్, రెడ్
క్యాబేజ్, పసుపు ద్రావణాలను సహజ సూచికలు అంటారు.
Ø
→ ఆమ్ల – క్షార సూచికలు అద్దకం
లేదా అద్దకం యొక్క మిశ్రమాలు.
Ø
→ ఆమ్ల – క్షార సూచికలను
ఆమ్ల-క్షార ద్రావణులుగా గుర్తించటానికి వాడతారు.
Ø
→ జల ద్రావణాలలో H+ అయాన్లను ఇచ్చే వాటిని ఆమ్లాలంటారు.
HCl, H2SO4, HNO3, CH3COOH ఆమ్లాలకు ఉదాహరణ.
Ø
→ జల ద్రావణాలలో OH– అయాన్లను ఇచ్చే వాటిని క్షారాలంటారు.
ఉదా: NaOH, KOH, Ca(OH)2.
Ø
→ ఒక ద్రావణంలో H+ అయాను ఉండడం వలన ఆ ద్రావణానికి ఆమ్ల ధర్మం వస్తుంది. అదే విధంగా OH– అయాన్ ఉండడం వలన ఆ
ద్రావణానికి క్షార ధర్మం ఏర్పడుతుంది.
Ø
→ కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు
క్షార మాధ్యమాలలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు
అంటారు.
Ø
→ అలోహాలకు ఉదాహరణ : హైడ్రోజన్,
కార్టన్, నైట్రోజన్, ఆక్సిజన్,
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్,
ఫాస్ఫరస్, సల్ఫర్, అయొడిన్,
సిలికాన్.
Ø
→ అలోహ ఆక్సైడ్ లు CO2,
NO2, N2O5, P2O3 P2O5.
Ø
→ అలోహ ఆక్సైడ్ లను నీటిలో
కరిగిస్తే ఆమ్లాలు ఏర్పడతాయి.
Ø
→ ఆమ్లాలు, లోహాలతో
చర్య జరిపి లోహ లవణాలను, హైడ్రోజన్ వాయువును విడుదల
చేస్తాయి.
Ø
→ Zn లోహం సజల HNO తో చర్య జరిపి హైడ్రోజన్‌ను ఇవ్వదు.
Ø
→ ఆమ్లాలు కారొనేట్లు, బై కార్బొనేట్లతో చర్యజరిపి లోహ లవణాలను, CO2ను, నీటిని విడుదల చేస్తాయి.
Ø
→ లోహాలు : Na, P, Ca, Mg,
AL లోహాలకు ఉదాహరణలు.
Ø
→ లోహ ఆక్సైలు : Na2O,
K2O, MgO, CaO లాంటివి కలవు.
Ø
→ లోహ ఆక్సైడ్ లను నీటిలో
కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి.
Ø
→ క్షారాలను వేడి చేస్తే వియోగం
చెందుతాయి.
Ø
→ క్షారాలు, ఆమ్లాలతో చర్య జరిపి లవణాలను, నీటిని ఏర్పరుస్తాయి.
Ø
→ కేవలం జింక్ లోహం మాత్రమే NaOHతో చర్య జరిపి సోడియం జింకేట్ (Na2Zn)2) ను ఏగ్గరుస్తుంది.
Ø
→ ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే
చర్యను తటస్థీకరణ చర్య అంటారు.
Ø
→ ఆమ్లాన్ని, క్షారంతో కలిపినపుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరజోష్ణం అంటారు.
Ø
→ తటస్థీకరణం ఉష్ణమోచక చర్య.
Ø
→ ఆమ్లాలు, లోహ
ఆక్సైడ్ లతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచును.
Ø
→ లోహ ఆక్సైడ్ లు క్షార
స్వభావాన్ని కలిగి ఉంటాయి.
Ø
→ ఆహారంలో విడుదలైన అధిక
ఆమ్లాన్ని తటస్థీకరించే బలహీన క్షారాలను ఏంటాసిడ్ అంటారు.
Ø
→ జెలూసిల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలు ఏంటాసిడ్లకు ఉదాహరణలు.
Ø
→ నీరు ద్రావణిగా ఉన్న ద్రవాలను
జల ద్రావణాలు అంటారు.
Ø
→ ఆమ్ల జల ద్రావణాలలో H+ అయాన్లుంటాయి. కాబట్టి విద్యుత్ వాహకాలను ప్రదర్శిస్తాయి.
Ø
→ నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ
అంటారు.
Ø
→ క్షార ద్రావణాలలో OH– అయాన్లుంటాయి. కాబట్టి విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి.
Ø
→ ఆమ్ల, క్షార
ద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించడానికి కారణం H+, OH– లను కలిగి ఉంటాయి.
Ø
→ గ్లూకోజ్, యూరియా వంటి ద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించవు. కారణం వీటిలో H+,
OH– అయాన్లు లేకపోవడమే.
Ø
→ H+ అయానుకు స్వతంత్ర ఉనికి
లేదు. హైడ్రోనియం (H3O+) అయానుగా
ఉండును.
Ø
→ సజల ఆమ్లాలు తయారు చేయునపుడు
నీటికి కొద్దిగా ఆమ్లాన్ని కలుపుతూ కలియబెట్టాలి.
Ø
→ గాఢ ఆమ్లంలోకి నీటిని కలిపితే
అధిక ఉష్ణం విడుదలైతే ప్రమాదాలకు దారి తీస్తుంది.
Ø
→ ఏ ఆమ్లం యొక్క జల ద్రావణంలోనైనా
H3O+ అయాన్లు ఎక్కువ ఉంటే
అవి ఎక్కువ విద్యుత్ వాహకతను చూపును. వీటిని బలమైన ఆమ్లాలు అంటారు. ఉదా: HCl, H2SO4, HNO3.
Ø
→ ఏ ఆమ్లాల జలద్రావణంలో H3O+ అయాన్లు ఎక్కువ ఉంటాయో అవి తక్కువ విద్యుత్ వాహకతను
ప్రదర్శిస్తాయి. వీటిని బలహీన ఆమ్లాలంటారు.
ఉదా : CH3COOH, H3PO4, H2CO3.
Ø
→ ఏ క్షారాల జల ద్రావణాలలో
అధికంగా OH– అయాన్లు కలిగి, అధిక విద్యుత్ వాహకతను చూపుతాయో వాటిని బలమైన
క్షారాలంటారు. ఉదా: NaOH, KOH.
Ø
→ ఏ క్షారాల జల ద్రావణాలలో తక్కువ
OH– అయాన్లు కలిగి తక్కువ
విద్యుత్ వాహకతను చూపుతాయో వాటిని బలహీన క్షారాలంటారు. ఉదా : NH4OH, Mg(OH)2, Ca(OH)2.
Ø
→ సార్వత్రిక ఆమ్ల, క్షార సూచికను ఉపయోగించి కూడా బలమైన, బలహీనమైన ఆమ్ల
– క్షారాలను గుర్తించవచ్చు.
Ø
→ H+ అయాను యొక్క ఋణ
సంవర్గమానాన్ని pH స్కేల్ అంటారు. * తటస్థ
ద్రావణాలకు pH విలువ = 7
Ø
→ ఆమ్ల ద్రావణాలకు pH విలువ 7 కంటే తక్కువ.
Ø
→ క్షార ద్రావణాల pH విలువ 7 కంటే ఎక్కువ.
Ø
→ pH స్కేలు (0 – 14) ద్వారా ఆమ్ల – క్షార ద్రావణాల యొక్క బలాన్ని గుర్తించవచ్చు. ఈ pH స్కేలు విలువ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలియజేస్తుంది.
Ø
→ జీవరాశుల యొక్క జీవన ప్రక్రియలు
నిర్దిష్ట pH విలువను కలిగి ఉంటాయి.
Ø
→ వర్షపు నీటి యొక్క pH విలువ 5.6 కంటే తక్కువ ఉంటే దానిని ఆమ్ల వర్షం
అంటారు.
Ø
→ pH విలువ 5.5 కంటే తక్కువ ఉంటే దంత క్షయం ఏర్పడుతుంది.
Ø
→ సోడియం క్లోరైడ్ ను సాధారణ
ఉప్పు అంటారు.
Ø
→ NaCl నుండి 1) NaOH 2) బేకింగ్ సోడా 3) బట్టల సోడా 4) బ్లీచింగ్ పౌడర్ వంటి సమ్మేళనాలను తయారుచేస్తారు.
Ø
→ బ్లీచింగ్ పౌడర్‌ను
విరంజనకారిగా, క్రిమిసంహారిణిగా వాడతారు.
Ø
→ బేకింగ్ సోడాను బేకింగ్ పౌడర్
తయారీలో మరియు వంటలలో విరివిగా వాడతారు.
Ø
→ వాషింగ్ సోడా గాజు తయారీలో
ముడిపదార్థం.
Ø
→ లవణంలో నిర్దిష్ట సంఖ్యలో ఉన్న
నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
Ø
→ స్ఫటిక జలం కలిగిన కొన్ని
లవణాలు ఖచ్చితమైన సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటాయి.
Ø
→ CaSO4, 2H2O ను జిప్సం అంటారు.
Ø
→ కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్
(CaSO4 ½H2O)ను ప్లాస్టర్ ఆఫ్
పారిస్ అంటారు.
Ø
→ సూచికలు : ఆమ్ల క్షార
మాధ్యమాలలో వేర్వేరు రంగులనిచ్చు పదార్థాలను సూచికలు అంటారు.
Ø
→ ఆమ్లం : జల ద్రావణాలలో H
+ అయాన్లు ఇచ్చే వాటిని ఆమ్లాలు అంటారు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.
Ø
→ క్షారం : ఏవైతే ఆమ్లాలతో చర్య
జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయో వాటిని క్షారాలంటారు. ఇవి
రుచికి చేదుగా ఉండి, జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.
Ø
→ ఎర్ర లిట్మస్ కాగితం :
క్షారాలను గుర్తించటానికి లిట్మస్ ద్రావణం నుండి తయారుకాబడిన ఎరుపు రంగు
కాగితపు పట్టీని ఎర్ర లిట్మస్ కాగితం అంటారు.
Ø
→ నీలి లిట్మస్ కాగితం : ఆమ్లాలను
గుర్తించటానికి లిట్మస్ ద్రావణంతో తయారుకాబడిన నీలిరంగు కాగితపు పట్టీని నీలి
లిట్మస్ కాగితం అంటారు.
Ø
→ ఫినాఫ్తలీన్ : క్షార మాధ్యమంతో
పింక్ రంగును, ఆమ్ల మాధ్యమంతో రంగుచూపని ద్రావణాన్ని
ఫినాఫ్తలీన్ అంటారు.
Ø
→ మిథైల్ ఆరెంజ్ : ఆమ్ల మాధ్యమంలో
ఎరుపు రంగుకు, క్షార మాధ్యమంలో పసుపు రంగుకు మారగల రంజనాన్ని
మిథైల్ ఆరెంజ్ అంటారు.
Ø
→ లవణం : ఆమ్లాన్ని క్షారంతో
తటస్థీకరించినపుడు ఏర్పడు పదార్థాన్ని లవణం అంటారు.
Ø
→ తటస్థీకరణం : క్షారంతో ఒక ఆమ్లం
చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య
అంటారు.
Ø
→ హైడ్రోనియం అయాన్ : హైడ్రోజన్
అయాన్ (H+) స్వేచ్చా అయానుగా ఉండదు. మరొక నీటి
అణువుతో కలుస్తుంది. దీనినే హైడ్రోనియం అయాన్ అంటారు.
H+ + H2O → H3O+
Ø
→ ఆల్కలీ : ఏ క్షారాలైతే నీటిలో
కరుగుతాయో ఆ క్షారాలను ఆల్కలీ అంటారు.
Ø
→ బలమైన ఆమ్లం : ఏ ఆమ్లాలైతే
ఎక్కువ సంఖ్యలో H3O+ అయానులనిస్తాయో వాటిని
బలమైన ఆమ్లాలని అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.
Ø
→ బలమైన క్షారం : ఏ క్షారాలైతే
ఎక్కువ సంఖ్యలో OH– అయానులనిస్తాయో వానిని
బలమైన క్షారాలంటారు.
ఉదా : NaOH, KOH.
Ø
→ సార్వత్రిక సూచిక : అనేక సూచికల
మిశ్రమాన్ని సార్వత్రిక ఆమ్ల – క్షార సూచిక అంటారు. ఇది వేర్వేరు హైడ్రోజన్ అయాను
గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.
Ø
→ pH స్కేల్ : హైడ్రోజన్ గాఢత
యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేల్ అంటారు.
pH = – log (H+). దీనిని కనుగొన్నది సొరెన్సన్.
Ø
→ ఏంటాసిడ్ : ఏంటాసిడ్ అనగా బలహీన
క్షారం. ఆహార పదార్థాల నుండి తయారైన అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి
ఉపశమనాన్ని కలుగజేయును.
ఉదా : జెలూసిల్ మరియు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.
Ø
→ దంతక్షయం : నోటిలోని అధిక
పరిమాణం గల ఆమ్లాల వలన పండ్ల పైన అత్యంత ధృఢమైన ఎనామిల్ పొర క్షీణించి పన్ను నాశనం
అవటాన్ని దంతక్షయం అంటారు.
Ø
→ లవణాల కుటుంబం : ఒకే విధమైన ధన
అయాన్లను లేదా ఋణావేశ రాడికల్స్ ను కలిగియున్న లవణాలను ఒకే కుటుంబానికి చెందిన
లవణాలు అంటారు.
Ø
→ సామాన్య లవణం : సోడియం క్లోరైడ్
ను సామాన్య లవణం అంటారు. ఆహార పదార్థాలకు రుచిని పెంచడానికి దీనిని వాడతారు.
పదార్థాలకు ఉన్న రంజనాన్ని పోగొట్టడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతారు. దీనినే విరంజన
కారి అంటారు.
Ø
→ బేకింగ్ సోడా : సోడియం
హైడ్రోజన్ కార్బోనేట్ ను (NaHCO3) బేకింగ్ సోడా
అంటారు. దీనిని పదార్థాలను త్వరగా ఉడికించడానికి వాడతారు. బజ్జీలు, పూరీ పిండి తయారీలో బేకింగ్ పౌడర్ కలిపితే అవి బాగా ఉబ్బి ఆకర్షణీయంగా
ఉంటాయి.
Ø
→ వాషింగ్ సోడా : సోడియం
కార్బొనేట్ ను పునః స్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది. దీనిని Na2CO3.10H2O
తో సూచిస్తారు. దీనినే బట్టల సోడా అని కూడా అంటారు.
Ø
→ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ :
కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. దీనిని CaSO4 ½H2O తో సూచిస్తారు.
Ø
→ ఆర్ధ లవణం : ఏదైనా లవణం
నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటే ఆ లవణాన్ని ఆర్ధ లవణం అంటారు.
ఉదా : CuSO4 5H2O, Na2CO3 10H2O.
Ø
→ స్పటిక జలం : ఏదైనా లవణం యొక్క
ఫార్మూలాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
Ø
→ గార్డ్ ట్యూబ్ : వాతావరణంలో తేమ
ఎక్కువగా ఉంటే తేమ పోగొట్టడానికి కాల్షియం క్లోరైడ్ గల నిర్జలీకరణ గొట్టాన్ని
గార్డ్ ట్యూబ్ అంటారు.
Ø
→ పొటెస్ట్ : pH స్కేలులో p అనగా పొటెస్ట్. జర్మనీ భాషలో పొటెస్ట్
అనగా సామర్థ్యం అని అర్థం.
Ø
→ అనార్ధ లవణం : ఆర్ధ లవణాలను
వేడిచేసినపుడు స్పటిక జలం ఆవిరి రూపంలో పోయి, మిగిలిన లవణాన్ని
అనార్ధ లవణం అంటారు.
Ø
→ ట్రైన్ ద్రావణం : NaCl జల ద్రావణాన్ని ట్రైన్ ద్రావణం అంటారు.
Ø
→ కాస్టిక్ సోడా : NaOH క్షారం చర్మాన్ని, బట్టలను, పేపర్లను
తినివేస్తుంది. ఈ క్షారాన్ని కాస్టిక్ సోడా అంటారు.
Ø
→ క్విక్ లైమ్ : కాల్షియం ఆక్సైడ్
ను క్విక్ లైమ్ అంటారు.
Ø
→ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా : Mg(OH)2 ను మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు.
Ø
→ జిప్సం : CaSO4 2H2O ను జిప్సం అంటారు.
Ø
→ బేకింగ్ పౌడర్ : బేకింగ్ సోడాకు
కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్ మరియు పిండి పదార్థాలు కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని
బేకింగ్ పౌడర్ అంటారు.
Ø
→ ఓల్ ఫ్యాక్టరీ : కొన్ని
పదార్థాలు ఆమ్ల మరియు క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని
ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.
Ø
→ విలీనత : ఆమ్లానికి గానీ,
క్షారానికి గానీ నీటిని కలిపినపుడు ప్రమాణ ఘనపరిమాణంలో గల అయానుల
గాఢత తగ్గుతుంది. ఈ దృగ్విషయాన్ని విలీనత అంటారు.
Ø
→ రాక్ సాల్ట్ : భూమి పొరలలో
సోడియం క్లోరైడ్ స్పటికాలు మలినాలతో కలిసి ఉండడాన్ని రాక్ సాల్ట్ లేదా ఉప్పు
అంటారు.
Ø
→ క్లోరో ఆల్కలీ ప్రక్రియ : NaCl
జల ద్రావణం గుండా విద్యుతను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది NaOH
ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు.
Ø
→ ఫ్లేక్ట్ టైమ్ : CaOH కు నీళ్ళు కలిపి కాల్చబడిన సున్నపురాయిని స్లేక్ట్ లైమ్ అంటారు. లేదా పొడి
Ca(OH)2 ను స్లేక్ట్ లైమ్
అంటారు.
Ø
→ క్లోరోఫామ్ : CHCl3ను క్లోరోఫాం అంటారు. దీనిని ఆపరేషన్ చేయునపుడు డాక్టర్ రోగికి క్లోరోఫామ్
ను మత్తుమందుగా వాడతారు.