8th Class Social 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ
8th class social bits, 8th class social textbook 1st lesson, AP Class 8th Social Bits Chapter 1 Best Notes and MCQ – 8th class social chapter 1, ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, class 8th chapter 1 question answer, Dsc 2022, tet 2022
Join In Our Whatsapp Group
పటాల అధ్యయనం - విశ్లేషణ
- ముఖ్యమని భావించే అంశాలు చూపించడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు పటాలను ఉపయోగిస్తారు.
- వివిధ కాలాల్లో పటాలు :
- ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు నాలుగువేల సంవత్సరాల నాటివి. వాటిని తయారుచేసింది సుమేరియన్లు (ప్రస్తుత ఇరాక్)
- వీరు దేవాలయాల భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాలు రూపంలో భద్రపరిచారు. వీటిని మట్టి పలకల మీద చేశారు.
- మొదట కొన్ని ప్రపంచ పటాలు తయారుచేసింది బాబిలోనియన్లు (ప్రస్తుత ఇరాక్). దీనిని 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద గీసారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే.
8th class social bits, 8th class
social textbook 1st lesson, AP Class 8th Social Bits Chapter 1 Best Notes and
MCQ – 8th class social chapter 1, ap dsc 2022, ap new telugu content, apt et
telugu content, aptet 2022, class 8th chapter 1 question answer, Dsc 2022, tet
2022
- వీరు బాబిలోన్ పట్టణం మధ్యలో చూపించారు. లోపల వలయం బయట "చేదునది / ఉప్పు నీటి సముద్రం" ఉంది. దానిలో త్రికోణాకృతిలో ఏడు దీవులు ఉన్నాయి.
- గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్షిమండర్, మిలేటస్ (ప్రస్తుత టర్కీ) కు చెందిన హెకేటియన్ లు కూడా ప్రపంచ పటాలు తయారుచేశారు.
- వీరు తయారుచేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వాళ్ళ వివరణలు ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారుచేశారు.
- వీళ్ళు ప్రపంచాన్ని యూరప్, లిబియా(ఆఫ్రికా), ఆసియా అని మూడు ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. మధ్యలో గ్రీసు ఉంటుంది
- దగ్గర దూర ప్రాంతాల గూర్చి తెలుసుకోవడానికి వాటి పటాలు తయారీకి గ్రీకులు, తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు.
- అక్షంశాలు, రేఖంశాలు ఆధారంగా పటాలని ఖచ్చితంగా తయారుచేయడానికి గ్రీకులు ప్రయత్నించారు.
- ఒకే సమయంలో మిట్టమధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీసారు. దీనిని "మెరిడియన్ (మధ్యాహ్న రేఖ) లేదా రేఖంశం" అంటారు.
- మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షంశాలు గీయడానికి ప్రయత్నించారు.
- రెండు రకాల గీతలతో పటం మీద గళ్ళు(గ్రిడ్) గీసారు.
- అక్షంశాలు, రేఖంశాలు సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది.
- నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గూర్చి పటాలు తయారుచేసే వాళ్ళకి చెప్పి వాళ్ళకి సహకరించారు.
- అక్షంశాలు, రేఖంశాలు ఉపయోగించి సవివరంగా పటాలు తయారుచేసింది "టాలమి". కానీ ఆ పటాలు అందుబాటులో లేవు.
- పటాలు తయారీకి అరబ్బు పండితులు, నావికులు టాలమి పుస్తకాలు ఉపయోగించారు.
- అల్ ఇద్రిసి తన రాజు కోసం 1154 లో ఒక ప్రపంచ పటం తయారుచేశాడు. పటం వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి.
- ఈ పటంలో యురేషియా ఖండం పూర్తిగా మరియు ఆఫ్రికా ఉత్తర భాగం చూపించారు. ఆఫ్రికా దక్షిణ భాగం ఆగ్నేయాసియా భాగాల వివరాలు చూపించలేదు. అరేబియాను మధ్యలో చూపించారు.
8th class social bits, 8th class
social textbook 1st lesson, AP Class 8th Social Bits Chapter 1 Best Notes and
MCQ – 8th class social chapter 1, ap dsc 2022, ap new telugu content, apt et
telugu content, aptet 2022, class 8th chapter 1 question answer, Dsc 2022, tet
2022
- పటంలో దక్షిణం పై భాగంలో ఉత్తరం కింది భాగంలో చూపించారు.
- 1389 లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టు గుడ్డ మీద డా మింగ్ హాన్ యి తు ఒక పటం గీసాడు.
- బైబిల్ వర్ణించిన పటంలో ప్రపంచాన్ని ఆసియా, ఆఫ్రికా, యూరప్ అనే మూడు ఖండాలుగా విభజించి ఉంది. దీనిలో యేసుక్రీస్తు జన్మ స్థలం అయిన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం పెద్దదిగా పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింద భాగంలో చూపారు.
- 1480 ప్రాంతంలో టాలమి పుస్తకాలు యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు కానీ అతను గీసిన పటాలు దొరకలేదు.
- 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు.
- మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గం అరబ్బులు మూసివేశారు. దాంతో భారతదేశానికి సముద్ర మార్గం కనుకోవడానికి పచ్చిమ యూరప్ ( స్పెయిన్, పోర్చుగల్, హాలండ్, ఇంగ్లాండ్ వంటివి ) వ్యాపారస్తులు బయలుదేరారు.
- కొలంబస్ అమెరికాని, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారు.
- 16 శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది.
- డచ్ దేశ పటాలు తయారీదారుల పితామహుడు "గెరార్డస్ మెర్కెటర్(1512 - 94)"
- ఖండాలు పరిమాణం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని "మెర్కెటర్ ప్రక్షేపనం" అని అంటారు.
- దేశం అంతటిని సర్వే చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పాటు చేశారు.సర్వేయర్ జనరల్ గా "జేమ్స్ రెన్నల్" ను నియమించారు.
- సర్వే ఆధారంగా తయారైన భారతదేశ మొదటి పటాలను అతడు తయారుచేశాడు.
- ప్రపంచంలోనే అతి ముఖ్యమైన భౌగోళిక సర్వేను 1802 లో "విలియం లాంబటన్" ఆరంభించాడు. దక్షిణాన చెన్నై దగ్గర మొదలు పెట్టి ఉత్తరాన హిమాలయాల వరకు రేఖంశాలు పొడవు నిర్ణయించి, వివిధ ప్రదేశాల ఎత్తులు నిర్ణయించాడు.
- ఈ సర్వే పూర్తి చేసింది సర్ జార్జ్ ఎవరెస్టు. ఈ సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్టు పర్వతం ప్రపంచంలో ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది.
- అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే సముద్ర తీరం అయిన చెన్నైలో మొదలైంది.
- నేటి కాలంలో దేశ అభివృద్ధికి, ప్రణాళికల తయారీకి పటాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు.
- ఒక పటం ఒక అంశం పైనే కేంద్రీకరిస్తే ఇటువంటి పటాలను "విషయ నిర్ధేశిత (థీమాటిక్) పటాలు" అంటారు.
- ప్రజలు భూమిని ఉపయోగించే విధానాన్ని తెలిపే పటాలు "భూ వినియోగ పటాలు"
8th class social bits, 8th class
social textbook 1st lesson, AP Class 8th Social Bits Chapter 1 Best Notes and
MCQ – 8th class social chapter 1, ap dsc 2022, ap new telugu content, apt et
telugu content, aptet 2022, class 8th chapter 1 question answer, Dsc 2022, tet
2022
- రంగు -భూ అచ్ఛాదన / భూ వినియోగం
- ముదురు ఆకుపచ్చ - అడవి
- లేత ఆకుపచ్చ -గడ్డి భూములు
- గోధుమ / మట్టి రంగు - వ్యవసాయానికి అనువైన భూములు
- పసుపుపచ్చ (నైసర్గిక పటాలు) - పంటలు సాగు అవుతున్న ప్రాంతం
- ముదురు ఉదా - పర్వతాలు
- లేత ఉదా - గుట్టలు
- జనాభాను సూచించే పటాలు - జనసాంద్రత పటాలు
- భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. భారత సర్వేక్షణ శాఖ జారీ చేసే సాంప్రదాయ సంకేతాలుని "టోపో షీట్లు" అంటారు.
- సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో గల ప్రదేశాలను కలిపే రేఖలను"కాంటూరు రేఖలు (ఐసోలైన్స్)" అంటారు.
- కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్ధం. దగ్గరగా ఉంటే తీవ్రవాలు ఉందని అర్ధం.
- పటాలు సంకలనం - అట్లాస్
Special Thanks To :