*మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్య పడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని మన దగ్గరకు రానివ్వకూడదు.*
*రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మానవుడు ఏనాటికీ పరిపూర్ణత పొందలేడు.*
*ఇనుమును తుప్పు చెడగొట్టినట్లే, మనసును బద్ధకం సోమరిగా చేస్తుంది*.
*కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా, వాటిని ఎదురించే శక్తిని ఇవ్వమని ప్రార్థించడం మిన్న.*
*ఆకలితో ఉన్న కడుపు, ఖాళీ జేబు, విరిగిపోయిన మనస్సు నేర్పినన్ని పాఠాలను జీవితంలో వేరెవ్వరూ నేర్పలేరు*.