Ticker

6/recent/ticker-posts

X Class SS రాంపురం - గ్రామ ఆర్ధిక వ్యవస్థ notes

రాంపురం - గ్రామ ఆర్ధిక వ్యవస్థ
రాంపురం గ్రామ కధ :
  • భారతదేశ గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను "వ్యవసాయేతర కార్యకలాపాలు" అని అంటారు. 
  • ఉత్పాదక వ్యవస్థలను ఉత్పత్తి ప్రక్రియలో మౌలిక అంశాలు ఉపయోగించి విశ్లేషించవచ్చు. ఉత్పత్తి ఎలా వ్యవస్థీకరించబడుతోంది అనేది ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
  • పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలల్లో రాంపురం ఉంది. హర్యానాతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయ పరంగా సంపన్నమైన ప్రాంతం.
  • ఈ గ్రామంలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం.






భూమి, ఇతర సహజవనరులు :
  • రాంపురంలో 1921 నుంచి సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు. అంతకు ముందే చుట్టుపక్కల అడవులని, ఊళ్ళో బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చారు.
  • ఖరీఫ్ లో రైతులు "జొన్న, సజ్జలు" సాగు చేస్తారు.ఆహారాధాన్యంతో పాటు వీటి చొప్ప పశువుల మేతగా ఉపయోగపడుతుంది.
  • అక్టోబర్ - డిసెంబర్ నెలల మధ్య "బంగాళదుంప పంట" (మూడవ పంటగా) సాగు చేస్తారు. రబీ కాలంలో "గోధుమ" పంట వేస్తారు.
  • కొంత విస్తీర్ణంలో "చెరకు" సాగు చేస్తారు.
  • ఒక సంవత్సరంలో ఒకే విస్తీర్ణంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని "బహుళ పంటలు సాగు" అంటారు.
  • భూమి నుంచి ఉత్పత్తి పెంచడానికి ఇది అత్యంత సాధారణ పద్దతి.
  • రైతులు బావులు నుండి నీళ్ళు తోడడానికి "పర్షియన్ వీల్" అనే పరికరం ఉపయోగించేవారు.
  • 50 సంవత్సరాల క్రితం మొదట బోరుబావులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావులు ఏర్పాటు చేసుకోసాగారు.






  • ఫలితంగా 1970 దశాబ్ది మధ్య కాలం నాటికి 264 హెక్టర్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది.
  • భారతదేశంలో నదీమైదానాలు, కోస్తా ప్రాంతంలో మాత్రమే సాగునీటి సదుపాయాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా దక్కను పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాలలో నీటి సదుపాయాలు తక్కువ.
  • ఈనాటికి కూడా 40% కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది.





రాంపురంలో భూ పంపిణీ :
  • రాంపురం జనాభా 2660. ఇక్కడ వివిధ కులాలకు చెందిన 450 కుటుంబాలు ఉన్నాయి. జనాభాలో మూడో వంతు దళితులు ఉన్నారు.
  • రాంపురంలో 150 కుటుంబాలకు(1/3 వ వంతు) భూమి లేదు. భూమి లేని వాళ్లలో అధిక శాతం దళితులు.
  • రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్య తరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతులతో కొంతమందికి 10 హెక్టార్లకు మించి భూమి ఉంది. రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్నవాళ్లు 240 కుటుంబాలు.





ఉత్పత్తి నిర్వహణ :
  • ప్రజలకు అవసరమైన వస్తువులు, సేవలు అందించడమే ఉత్పత్తి ఉద్దేశ్యం.
  • మొదటిది భూమి, నీళ్లు, అడవులు, ఖనిజలవణాలు వంటి సహజవనరులు కావాలి.
  • రెండవది శ్రామికులు. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలు బాగా చదువుకున్న, నైపుణ్యం ఉన్న కార్మికులు కావాలి. మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి.
  • మూడవది పెట్టుబడి అంటే ఉత్పత్తి యొక్క అన్ని దశలలో అవసరమైన అన్ని వస్తువులు.
  • అ) పనిముట్లు, యంత్రాలు, భవనాలు
  • ఇవి వస్తు ఉత్పత్తిలో అనేక సంవత్సరాలు ఉపయోగపడతాయి. వీటికి కొంత మరమ్మత్తు, నిర్వహణ అనేది అవసరం. వీటిని "స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి" అని అంటారు.
  • ఆ) అవసరమైన ముడిసరుకు, డబ్బు
  • వీటిని "నిర్వాహక పెట్టుబడి" అని అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఇవి పూర్తిగా వినియోగించబడి చివరకు మిగలవు.
  • నాలుగవది జ్ఞానం, వ్యాపారదక్షత - భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడి ఉపయోగించి సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చెయ్యడానికి జ్ఞానం, ఆత్మవిశ్వాసం తప్పనిసరి. భౌతిక పెట్టుబడి ఉన్న వాళ్లు లేదా నియమించుకున్న మేనేజర్లు ఈ ప్రక్రియలో దోహదపడతారు.
  • భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడి మూడింటిని కలిపి "ఉత్పత్తి కారకాలు" అంటారు. 






వ్యవసాయానికి అవసరం అయిన శ్రమ :
  • భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన అంశాలలో శ్రమ ఒకటి.
  • భూమి లేని కుటుంబాల నుండి లేదా చిన్న రైతు కుటుంబాల నుండి వ్యవసాయ కార్మికులు వస్తారు.
  • ఈ వ్యవసాయ కూలీలు పండించే పంటపై ఎలాంటి హక్కు ఉండదు. దానికి బదులు వారు చేసిన పనికి డబ్బు రూపేణా గాని వస్తు రూపేణా గాని కూలి చెల్లిస్తారు.
  • కూలీని రోజుకూలీగా పెట్టవచ్చు, గుత్త పద్దతిలో పెట్టవచ్చు లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు.
పెట్టుబడి - భౌతిక పెట్టుబడి, నిర్వాహక పెట్టుబడిని ఏర్పాటు చేసుకోవడం :
  • నిర్వహణ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు పెద్ద రైతులు నుండి కానీ వడ్డీ వ్యాపారుల నుండి కానీ వ్యవసాయ ఉత్పాదకాలు సరఫరా చేసే వల్ల నుండి గాని అప్పు తీసుకుంటారు.
  • మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయ ఆదాయంలో మిగులు అందుబాటులో ఉంటుంది, ఈ విధంగా వాళ్ళు పెట్టుబడి సమకూరుచుకోగల్గుతారు.






రైతుకు మిగులు లేదా నష్టం :
  • రైతులు తమ పొలంలో పండించిన పంటలో కొంత కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగిలినది అమ్ముతారు.
  • ఇలా వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసి తరువాత పంట ఖర్చులకు ఉపయోగిస్తారు. కొందరు రైతులు పశువులు లేదా ట్రక్కులు కొంటారు. ఇంకా వ్యవసాయేతర పనులకు పెట్టుబడి పెడతారు.
  • కొన్నిసార్లు వరదలు, పురుగుల మందులు వల్ల పంట నష్టం కూడా వస్తుంది. లేదా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు కూడా నష్టం రావచ్చు.

రాంపురంలో వ్యవసాయేతర పనులు :
  • రాంపురంలో 25% మంది వ్యవసాయేతర పనులలో ఉన్నారు.
  • వ్యవసాయంలో రెండవ సాధారణ కార్యకలాపం "పాడి పరిశ్రమ"
  • పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలు
  • భూమి - గ్రామంలో సొంత కొట్టం(షెడ్డు)
  • శ్రమ - కుటుంబ శ్రమ, ప్రధానంగా మహిళలు పశువుల పోషణ చూస్తారు.
  • భౌతిక పెట్టుబడి - పశువుల సంతలో కొన్న పశువులు
  • నిర్వహణ పెట్టుబడి - తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు
రాంపురంలో చిన్నతరహా వస్తువుల తయారీ :
  • రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందే వాళ్ళు 50 కంటే తక్కువ ఉన్నారు.
  • మన దేశంలో చాలామంది "స్వయం ఉపాధి" పొందే వాళ్ళు ఉన్నారు. వస్తువుల, సేవల ఉత్పత్తికి ప్రణాళికలు తయారుచేసి, ఆ పనులు చేపట్టి అందులో లాభనష్టాలు భరించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు యజమానులౌతారు.
  • అదే సమయంలో ఈ ప్రక్రియలో తమ సొంత శ్రమ ఉపయోగిస్తారు.



  • భారతదేశంలో 87% ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం చాలా కష్టంగా ఉంది.
  • వ్యవసాయములో శ్రమను మితంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి శ్రామికులు అవకాశం కోసం వెదుక్కుంటూ వలస వెళ్తున్నారు. కొందరు వ్యవసాయేతర పనులు చేస్తున్నారు.
  • 2009 - 2010 లో భారతదేశంలో ప్రతీ 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు.
  • వ్యవసాయేతర పనులు విస్తరించడానికి మరో ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలకు మార్కెట్ ఉండడం.
  • మంచి రోడ్లు, రవాణా, టెలిఫోన్ సౌకర్యం వంటివి మెరుగుపడడం వల్ల గ్రామాలకు పట్టణాలు, నగరాలతో అనుసంధానం ఏర్పడి రానున్న కాలంలో గ్రామాలలో వ్యవసాయేతర పనులు పెరుగుతాయి.
Prepared A.B.Rao