*🌷త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్🌷*
*🌴డిఎస్‌సి-2020 నోటిఫికేషన్‌కు షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. మైనార్టీ, మున్సిపల్, సాంఘిక సంక్షేమ శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు రాలేదన్నారు. జనవరిలో టెట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.*
*🌴డిఎస్‌సి-2018 పోస్టుల భర్తీ పూర్తికాకపోవడంతో డిఎస్‌సి-2020 నోటిఫికేషన్‌కు అడ్డంకిగా మారిందన్నారు. తమకు పోస్టింగులు ఇవ్వకుండా డిఎస్‌సి-2020కు ఎలా వెళ్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్ వస్తుందన్నారు.*
*🌴ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ విద్యావాలంటీర్ల నియామకం త్వరలో చేపడతామన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉందన్నారు*