Ticker

6/recent/ticker-posts

3వ తరగతి మనం - మన పరిసరాలు


1. కుటుంబం
  • సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు.
  • కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు.
  • కుటుంబ సభ్యులు, వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను "వంశవృక్షం" అని అంటారు.
  • కళ్ళు లేనివాళ్ళు చదవడం కోసం "బ్రెయిలీ" అనే లిపి వాడతారు.
  • మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవాళ్లు సైగలతో మాట్లాడుకుంటారు.
  • వినికిడి సమస్య ఉన్న వాళ్ళు చెవిలో మెషీన్ పెట్టుకుంటారు.
  • కంటి చూపు సరిగా లేనివాళ్ళు కర్రలతోను, స్పర్శ ద్వారా విషయాలు గ్రహిస్తారు.
  • ప్రతీ సంవత్సరం అక్టోబర్ 01 వ తేదీని "వృద్ధుల దినోత్సవం" జరుపుకుంటాం.




2. ఎవరేం పని చేస్తారు ?
  • ఇంట్లో పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది.
  • ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను "వృత్తులు" అని అంటారు.
3. ఆడుకుందాం !
  • ఆటలు ఆడడం వల్ల మనకు ఆనందం, శరీరానికి వ్యాయామం కలుగుతాయి.
  • ఏ ఆటకైనా కొన్ని నియమాలు ఉంటాయి. 
  • పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్ తో కొడుతూ ఆడతారు.
  • పోలో ఆటకి మరో పేరు - చోగమ్
4. జంతువులు - వాటి నివాసాలు
  • జంతువులు కొన్ని చెట్ల మీద, కొన్ని నీళ్ళల్లో, కొన్ని నేల పైన, మరికొన్ని నేలలో బొరియలు చేసుకుని నివసిస్తాయి.
  • కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నీటిలో మరియు నేల మీద కూడా జీవిస్తాయి.
  • ఇళ్లల్లో పెంచుకునే జంతువులు - పెంపుడు జంతువులు
  • కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లలని పొడగడం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి. మరికొన్ని పక్షులు వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయి. వీటిని "వలస పక్షులు" అంటారు.
  • దోమలు నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి. నిలువ నీటిలో "కిరోసిన్ లేదా మలాతియాన్" మందులు చల్లడం వల్ల దోమలు చనిపోతాయి.




5. మన చుట్టు ఉన్న మొక్కలు
  • చెట్లు మనకి నీడనిస్తాయి. కలప కూడా వస్తుంది.
  • తాటి మట్టలు గుడిసెలు మీద కప్పడానికి వాడతారు.
  • కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని "నీటి మొక్కలు" అని అంటారు.
  • బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో, ఇసుకలో పెరుగుతాయి. వీటిని "ఎడారి మొక్కలు" అని అంటాము.
6. ఆకులతో అనుబంధం
  • మామిడి ఆకులు - చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి.
  • బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి.
  • చెత్తను కంపోస్టు గుంతలో వేయాలి, కాల్చకూడదు. ఇవన్నీ కుళ్ళి ఎరువుగా మారతాయి.
  • మన వంటలో ఆకులు వాడడం వల్ల ఆహారానికి వాసన, మంచి రుచి కూడా వస్తుంది.
7. మనం ఏమేమి తింటాం ?
  • ఆహారంగా తినే కూరగాయలు, పండ్లు, దుంపలు వంటివి మొక్కల నుండి వస్తాయి. పాలు, గుడ్లు, మాంసం వంటివి జంతువుల నుండి వస్తాయి.
  • ఆహార పదార్ధాలు ఎక్కువ ఉడికించడం వల్ల దానిలో పోషకాలు నశిస్తాయి.
  • అన్నం, పప్పు వంటి ఆహారపదార్ధాలు ఉడకపెడతారు. బజ్జీలు, సమోసలు మొదలైనవి నూనెలో వేయిస్తారు.
  • మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం మొదలైనవి నిప్పులు మీద కాలుస్తారు.
  • ఇడ్లీని ఆవిరి మీద ఉడికిస్తారు. ఆవకాయ, పెరుగుపచ్చడి వంటివి వేడి చేయకుండా కలిపి తయారు చేస్తారు.
  • ఆకుకూరలు, కూరగాయలు ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలో పోషక పదార్ధాలు నశిస్తాయి.
  • అన్నం వండేటప్పుడు బియ్యం ఎక్కువ కడగరాదు. గంజి వార్చకుండా వండాలి.




8. ఆహారపు అలవాట్లు
  • అంబలి రాగులతో చేస్తారు.
  • ఒక ప్రాంతంలో పండే పంటలు, లభించే ఆహారపదార్ధాలు ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి.
  • రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువ పండుతాయి. వాళ్ళు జొన్నరొట్టెలు తింటారు.
  • ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమ రొట్టెలు పూరీలు ఎక్కువ తింటారు.
  • తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు.
  • కేరళలో వరి అన్నంతో పాటు చేపలు ఎక్కువ తింటారు.
  • వయసును బట్టి ఆహార అలవాట్లలో తేడాలుంటాయి.
9. మన గ్రామం
  • గ్రామ పంచాయితీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వెయ్యడం వంటివి చేస్తారు.
  • పోస్ట్ ఆఫీస్ - ఉత్తరాలు చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత భీమా మొదలైన పనులు చేస్తారు.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం - వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలుపుతారు.
  • పశు వైద్యశాల - పశువులకు వైద్యం
  • బ్యాంక్ - డబ్బు దాచుకోవడం, ప్రజల అవసరాలకు అప్పులు ఇవ్వడం.
  • నీటిలో క్లోరిన్ కలిపి శుద్ధి చేస్తారు. 
10. రకరకాల ఇల్లు
  • ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుండి రక్షణ పొందడానికి ఇళ్లల్లో నివాసం ఉంటాం.
  • ఊరూరా సంచారం చేసేవాళ్ళు, సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు.
  • ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలు కడతారు. వీటిని "అపార్ట్మెంట్" అంటారు. దానిలో ఒక కుటుంబం నివాసం ఉండే స్థలం - ఫ్లాట్
  • ఒక అపార్ట్మెంట్ లో సుమారు 10 నుండి 30 కుటుంబాలు నివాసం ఉండవచ్చు. నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్లు ఉంటాయి.
  • కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో ఉంటాయి.
  • పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాలలో ఉన్నాయి. ఇగ్లు మంచు ప్రాంతాలలో ఉంటుంది.
  • పెంకు ఇల్లు, గుడిసెలు, డాబాలు, రేకుల ఇల్లు వంటివి శాశ్వత నివాసాలు. డేరాలు, గుడారాలు, పైపులు వంటివి తాత్కాలిక నివాసాలు.




12. మట్టితో చేసిన మాణిక్యాలు
  • మన రాష్ట్రంలో కొండపల్లి (కృష్ణా జిల్లా), ఏటికొప్పాక (విశాఖ జిల్లా) కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.
  • వినాయక ప్రతిమను మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తారు.
  • కుండ తయారీ దశలు
  • 1. బంకమట్టి తేవడం
  • 2. నానబెట్టి మెత్తగా చేయడం
  • 3. కుమ్మరి సారె పైన తిప్పి కుండ ఆకారం తయారు చేయడం
  • 4. కుండ సరైన ఆకారం వచ్చేలా "సలప" తో కొడతారు
  • 5. మొదట నీడలో తర్వాత ఎండలో ఆరబెడతారు
  • 6. ఎండకు ఆరిన కుండలు "ఆవం" లో పెట్టి కాలుస్తారు
  • కుండలు కొనేటప్పుడు వాటిపై వేలితో కొడితే టంగ్ టంగ్ మని చప్పుడు వస్తేనే కొంటారు.
13. రంగు రంగుల బట్టలు
  • మన శరీరాన్ని ఎండ, వాన, చలి నుండి కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం.
  • చలికాలంలో చలి నుండి కాపాడుకోవడానికి, వానాకాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేక దుస్తులు వేసుకుంటాం.
  • వివిధ ప్రాంతాల వాళ్లు సంప్రదాయాన్ని బట్టి రకరకాల దుస్తులు ధరిస్తారు.
  • నూలు బట్టలు పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుండి వచ్చే దారంతో పట్టుబట్టలు నేస్తారు.
  • చేతి రుమాలు - దస్తీ




14. ఏవేవి ఎక్కడెక్కడ ?
  • ఒక ప్రాంతంలో ఉన్న ఇల్లు, పాఠశాల వంటివి ఉన్నవి ఉన్నట్లు చిత్రంలో చూపడం కుదరదు. కాబట్టి వాటిని గుర్తులతో సూచిస్తారు.
15. నీరు - మన అవసరాలు
  • ఒంటె ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజులు నీళ్లు తాగకుండా ఉంటుంది.
  • కలుషిత నీరు త్రాగటం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి.
  • గరిటె - కాడగ్లాసు
  • మందం లేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు త్రాగారాదు.
  • నీటిలో క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలో క్రిములు చనిపోతాయి.
  • అవసరానికి చాలినన్ని నీరు దొరకని స్థితిని "నీటి ఎద్దడి" అని అంటాం.
16. ఊరికి పోదాం
  • వాహనాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి.
  • ప్రయాణించే దూరం, అవసరం బట్టి వివిధ రకాల వాహనాలు వాడతాం.
  • కొన్ని బళ్లు లాగటానికి గుర్రాలు కడతారు.
  • ఏనుగులు, గాడిదలు, ఒంటెలు కూడా ప్రయాణానికి ఉపయోగిస్తారు.

Prepared By A.B.Rao